News July 19, 2024
ప్రకాశం: వేగం పుంజుకున్న రైల్వే లైన్ పనులు
ప్రకాశం జిల్లా, పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పోయే నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మార్గం గుంటూరు జిల్లా నడికుడి నుంచి ప్రారంభమై, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు, శ్రీకాళహస్తి వరకు 308 కి.మీ నిర్మాణం జరుగుతుంది. 37 రైల్వేస్టేషన్లకు గాను, ప్రకాశం జిల్లాలో కురిచేడు, ముండ్లమూరు, దర్శి, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు స్టేషన్లకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
Similar News
News October 7, 2024
చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం
ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 7, 2024
అద్దంకి: ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజా వేదికకు తరలివచ్చిన ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
News October 7, 2024
త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం: ఎమ్మెల్యే తాటిపర్తి
ఇసుక ధరలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు ఉచిత ఇసుక ధర (18 టన్నులు) రూ.43,200 మాత్రమే. షరతులు వర్తిస్తాయి,’ అంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఉచిత ఇసుక అనేది బూటకపు మాటలని ఆదివారం పేర్కొన్నారు.