News May 11, 2024

ప్రకాశం: వైన్స్ షాప్‌కు భారీగా మందు బాబులు

image

మే 13న ఎన్నికలు జరుగుతున్నందున, వైన్స్ షాప్‌లు రెండు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైన్స్ షాప్‌లు దగ్గర మందు బాబులు భారీగా లైన్‌లు కట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు. మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం మొత్తం అమ్ముడు పోవడంతో వైన్స్ షాప్‌లు కొన్ని చోట్ల మూత వేశారు. కాగా, ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప్‌లు ఉంటాయని, ఆ తర్వాత మూత పడతాయన్న విషయం తెలిసిందే.

Similar News

News December 1, 2025

అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

image

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.

News December 1, 2025

BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

image

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.