News May 11, 2024
ప్రకాశం: వైన్స్ షాప్‌కు భారీగా మందు బాబులు

మే 13న ఎన్నికలు జరుగుతున్నందున, వైన్స్ షాప్‌లు రెండు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైన్స్ షాప్‌లు దగ్గర మందు బాబులు భారీగా లైన్‌లు కట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు. మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం మొత్తం అమ్ముడు పోవడంతో వైన్స్ షాప్‌లు కొన్ని చోట్ల మూత వేశారు. కాగా, ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప్‌లు ఉంటాయని, ఆ తర్వాత మూత పడతాయన్న విషయం తెలిసిందే.
Similar News
News February 7, 2025
చీమకుర్తి: 6 పేజీల సూసైన్ నోట్‌తో మృతి

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోనికి వెళ్తే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకి కారణం అయ్యుండొచ్చని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు శీను రాసిన ఆరు పేజీల లేఖను తన జేబులో గుర్తించారు. ‘నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త’ అంటూ తాను రాసిన లేక గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
News February 7, 2025
ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్

పాఠశాలల పునఃనిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతి మండలం నుంచి తయారు చేయబడిన పీపీటీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖాధికారులు తయారు చేసిన పీపీటీల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తరువాత ఏర్పాటుచేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్‌కి వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News February 6, 2025
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.