News January 8, 2025
ప్రకాశం: వైరస్ వల్ల ప్రజలు భయపడకండి: డీఎంహెచ్‌వో

బెంగళూరులో hMP వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు వస్తున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదన్నారు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు.
Similar News
News November 16, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.
News November 15, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.


