News June 6, 2024
ప్రకాశం: వైసీపీ కంచుకోటలు బద్దలు

ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటిది. TDP ఆవిర్భావం నుంచి రెండు సార్లే గెలిచింది. వైసీపీ రెండు పర్యాయాలు గెలిచి కంచుకోటగా మారింది. అలాంటిది ఈసారి అంచనాలను మారుస్తూ TDP నుంచి కందుల నారాయణరెడ్డి 13 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. అలాగే గిద్దలూరులో గత ఎన్నికల్లో 80 వేలకు పైగా మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఈసారి టీడీపీకి పట్టం కట్టారు. అశోక్ రెడ్డి 973 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Similar News
News December 13, 2025
ఈ ఒంగోలు అమ్మాయి చాలా గ్రేట్..!

ఒంగోలుకు చెందిన PVR గర్ల్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆముక్త తన ప్రతిభతో సత్తాచాటింది. జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించింది. 13 ఏళ్ల వయసులోనే మహిళ పైడే మాస్టర్ టైటిల్ పొందిన ఆముక్తను కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
News December 13, 2025
రాంగ్ రూట్లో వెళ్లకండి: ప్రకాశం పోలీసులు

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు.
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.


