News June 25, 2024

ప్రకాశం: షాప్ ముందుకు నీళ్లు వచ్చాయని మర్డర్: ఎస్సై

image

చీరాలలో ఈనెల 23న పట్టపగలు జరిగిన హత్యలో నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. పోలీసుల వివరాలు.. కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు కే.సంతోష్‌ రోడ్డుపై బబుల్‌తో నీళ్లు దొర్లించాడు. పక్కనే ఉన్న పండ్లషాప్ ముందుకు వెళ్లడంతో అందులో పనిచేసే ఉమామహేశ్వరరావు వాగ్వావాదానికి దిగాడు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. షాపు యజమాని యోసేఫ్‌ ప్రోద్బలంతో కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు.

Similar News

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 25, 2025

ప్రకాశం: జిల్లాలోని ఇల్లులేని పేదలకు గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాలోని ఇల్లులేని పేదలకు కలెక్టర్ రాజాబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లులేని పేదలను గుర్తించేందుకు కేంద్రం చేపట్టిన సర్వేకు నవంబర్ 5 వరకు గడువు ఉందని గురువారం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సచివాలయ, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నట్లు, జిల్లా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News October 25, 2025

ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

image

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.