News January 10, 2026

ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.