News December 5, 2024
ప్రకాశం: సంచలనమైన సర్పంచ్ హత్యకేసు కొట్టివేత

2016లో సంచలనమైన సంతమాగులూరు గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి హత్యకేసులో బుధవారం ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 8 సంవత్సరాలకు పైన న్యాయస్థానంలో విచారణ జరిగిన ఈ కేసులో నేర ఆరోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒంగోలు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి టి. రాజావెంకటాద్రి సెక్షన్ 235(1) కింద కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
Similar News
News March 7, 2026
పెద్ద దోర్నాల వద్ద ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.
News March 7, 2026
ప్రకాశం: మహిళా దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా జరిపించాలని సూచించారు. రవాణా, భోజనం, సాంకేతిక ఏర్పాట్లలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.


