News January 10, 2026

ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

image

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News January 22, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News January 22, 2026

మార్కాపురం జిల్లా.. మొదటిసారి రథసప్తమి వేడుకలు

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం మొదటిసారి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందన్నారు. సూర్యప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, రజిత రథోత్సవం, చంద్రప్రభ వాహనాలపై చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారన్నారు.

News January 22, 2026

ప్రకాశం: కందికి రూ.8వేలు

image

కంది కొనుగోలుకు రూ.8 వేలుగా ధరను ప్రభుత్వం నిర్ణయించిందని బేస్తవారిపేట మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. ఈ విషయాన్ని మండలంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు వివరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. కంది పైరు వేసిన ప్రతి రైతు వారికి సంబంధించిన RSK సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.