News August 26, 2024

ప్రకాశం: ‘సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు’

image

సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని దర్శి పోలీసులు సూచించారు. శనివారం దర్శి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన నేపథ్యంలో వారు పలు సూచనలు చేశారు. కాలువలు, బావులు, చెరువుల్లో ఈతకు దిగినప్పుడు, సముద్రంలో మునిగేటప్పుడు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 18, 2025

ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

image

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.