News March 2, 2025
ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
Similar News
News March 25, 2025
ప్రకాశం: యువతకు గమనిక

ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్ని ట్రేడ్స్ మెన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ సూచించారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలుగులోనే ఎగ్జాం నిర్వహిస్తారన్నారు. ఎన్‌సీసీ వారికి బోనస్ మార్కులు ఉంటాయన్నారు.
News March 25, 2025
ప్రకాశం: వారికి ఆన్‌లైన్‌లో పరీక్ష

ప్రకాశం: ఎయిడెడ్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాలని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు పొందాలని సూచించారు. ఈనెల 28, 29వ తేదీల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష రాయాలన్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసిన వారు అప్లికేషన్ తీసుకుని DEO ఆఫీసులో సంప్రదిస్తే హాల్ టికెట్ అందిస్తామని చెప్పారు.
News March 25, 2025
ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.