News July 12, 2024
ప్రకాశం: సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీఈవో సుభద్ర చెప్పారు. సీఎంవో, ఐఈసీవో, ఏ ఎల్ఎస్సీవో, ఏఎస్వీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్కూలు అసిస్టెంట్లను ఫారిన్ సర్వీసుపై నియమిస్తారు. జడ్పీ, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లు పోస్టులకు అర్హులన్నారు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News January 7, 2026
చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. కాగా ఢిల్లీలో ఉన్న మాగుంట ఈనెల 9న ఒంగోలుకు రానున్నారు. 9, 10న స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఒంగోలు పీవీఆర్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు.
News January 7, 2026
మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఎస్ఐ సైదుబాబుకు సమాచారం అందింది. ఆయన అక్కడికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 7, 2026
మార్కాపురం: 10రోజుల్లో పనుల పూర్తి

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రకాశం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. నూతన కార్యాలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోవారం పది రోజుల్లో పూర్తవుతాయన్నారు. అనంతరం ఇక్కడి నుంచి జిల్లా పరిపాలన మొదలవుతుందని తెలిపారు. సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మార్వో చిరంజీవి తదితర అధికారులు పాల్గొన్నారు.


