News September 18, 2024
ప్రకాశం: ‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News October 7, 2024
ఒంగోలు పోలీసులు కొట్టడం వల్లే రాజశేఖర్ చనిపోయారు: నాగేంద్ర
ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడం వల్లనే పరుచూరి రాజశేఖర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు. ఆదివారం ఒంగోలులోని GGHలో రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరగాలని.. మృతుడి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News October 6, 2024
ఒంగోలు: డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం ఈనెల 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా డిగ్రీ ప్రవేశాలు పొందని ఇంటర్ విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.
News October 6, 2024
పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి
ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.