News December 22, 2024

ప్రకాశం: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.

Similar News

News December 23, 2024

ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ మాట్లాడారు. క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమన్నారు.‌ క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయని‌ చెప్పారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు.

News December 22, 2024

 ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించింది. అదే మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూ ప్రకంపనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే శనివారం రోజు కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News December 22, 2024

పుష్ప-2 సినిమా చూసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.