News March 16, 2025
ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News November 21, 2025
కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News November 21, 2025
కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్మెన్గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 21, 2025
సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.


