News August 4, 2024
ప్రకాశం: 3 నెలల తర్వాత మోగనున్న పెళ్లి బాజాలు
మూడంతో 3 నెలలుగా నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరగనుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 21, 2024
బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?
బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
News September 20, 2024
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?
ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
News September 20, 2024
CM సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.