News April 22, 2024

ప్రకాశం: 30,928 మంది విద్యార్థుల ఉత్కంఠ

image

జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 170 కేంద్రాల్లో 30,928 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 30న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. మూల్యంకనం ముగిసిన 14 రోజులకే ఫలితాలు ప్రకటించడం ప్రభుత్వ పరీక్షల బోర్డు చరిత్రలో ఒక రికార్డు అని డీఈవో సుభద్ర తెలిపారు. మరికొద్ది సేపట్లో ఫలితాలు రానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News April 23, 2025

ఒంగోలు: వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

image

ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈయన 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్‌గా ఎన్నికై అనంతరం ఉపసర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నాగులుప్పలపాడు ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

News April 23, 2025

నేడు ప్రకాశం జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడంతో వారి మృతదేహానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రానున్నారు. అంతిమయాత్రలో సీఎం పాల్గొంటారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

News April 23, 2025

చంద్రబాబే లిక్కర్‌ స్కాం చేశారు: తాటిపర్తి

image

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్‌ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్‌ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.

error: Content is protected !!