News September 11, 2024
ప్రకాశం: APSSDC ఉద్యోగ ప్రకటన
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే.. విజయవాడలో రోజూవారీ వేతనంపై పని కల్పిస్తామని జిల్లా అధికారి రవితేజ చెప్పారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న NAC ట్రైనింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.
Similar News
News October 13, 2024
ప్రకాశం జిల్లాలో ‘కిక్కు’ ఎవరికో
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఈ నెల 12తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం షాపులకు గాను 3416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమక్షంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. మొదటి రోజే మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలని నిబంధనలో ఉంది.
News October 13, 2024
పండుగపూట కూడా అరాచకం: ఎమ్మెల్యే తాటిపర్తి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వంలో పండుగపూట కూడా అరాచకం. శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం నల్లబొమ్మయ్య పల్లిలో వాచ్‌మెన్, అతని కొడుకును ఐదుగురు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన కామాంధులు. రాష్ట్రంలో కామాంధులు నుంచి ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ ఇదేనా?’ అంటూ పోస్ట్ చేశారు.
News October 13, 2024
ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.