News March 25, 2025

ప్రకాశం: DSC అభ్యర్థులకు GOOD NEWS

image

ప్రకాశం జిల్లాలోని EBC, BC అభ్యర్థులకు మెగా DSC-2025కి ఆన్‌లైన్ ద్వారా, ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ BC స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకురాలు అంజలి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. అన్నింటితోపాటు 2 పాస్ ఫొటోలను కలిపి ఒంగోలులోని ఏపీ BC స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు. ధరఖాస్తులు 10వ తేదీనే ప్రారంభం అయినట్లు తెలిపారు.

Similar News

News April 24, 2025

అర్థవీడులో పులి సంచారం

image

అర్ధవీడు మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం మొహిద్దిన్ పురం సమీపంలో రోడ్డుపై పెద్దపులి కనిపించగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అధికారులు తనిఖీలు చేశారు. స్థానికంగా కనిపించిన గుర్తుల ఆధారంగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లుగా డీఆర్వో ప్రసాద్ రెడ్డి బుధవారం నిర్ధారించారు.

News April 23, 2025

ఒంగోలులో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

image

ఉగ్ర దాడిని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

News April 23, 2025

వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

image

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.

error: Content is protected !!