News March 24, 2025

ప్రకాశం: EKYC ఎక్కడ చేస్తారంటే..?

image

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.61లక్షల రేషన్ కార్డుల ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 19.37లక్షలుగా ఉంది. ఇందులో 17.31లక్షల మందే EKYC చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్ల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.

Similar News

News November 23, 2025

ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

image

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.

News November 23, 2025

వాహనదారులకు ప్రకాశం పోలీస్ కీలక సూచనలు.!

image

*హైవేల్లో భారీ ప్రమాదాలకు కారణం నిద్ర మత్తు
*నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ
*మీతోపాటు ప్రయాణికుల, పాదచారుల ప్రాణాలకు ముప్పు
*నిద్రమత్తు అనిపిస్తే వెంటనే వాహనం సైడుకు ఆపి 10-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి
*ప్రయాణం మొదలు పెట్టే ముందు సరిపోయేలా నిద్రపోవాలి
*దీర్ఘ ప్రయాణాల్లో 2 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.
*వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించండి.

News November 23, 2025

ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.