News August 2, 2024
ప్రకాశం: MRO, VROను సస్పెండ్ చేసిన కలెక్టర్
సీఎస్‌పురం పర్యటన సమయంలో జాయింట్ కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి MRO నాగుల్ మీరా, VRO శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. భూముల మ్యుటేషన్లకు సంబంధించి ఓ రైతు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిగిరి ఆర్డీవో ద్వారా విచారణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ నివేదిక మేరకు MRO, VROను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News September 15, 2024
కంభంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడ లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News September 15, 2024
ప్రకాశం: 50కేజీల లడ్డు సొంతం చేసుకున్న షేక్ కమల్
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉన్న 50 కేజీల లడ్డును కమిటీ నెంబర్లు వేలం వెయ్యగా.. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ కమల్ వలి రూ.26 వేలకు లడ్డును దక్కించుకున్నాడు. లడ్డును దక్కించుకున్న ముస్లిం యువకుడిని హిందువులు అభినందించారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు అన్నారు.
News September 15, 2024
చీరాలలో దారుణం.. వివాహితపై లైంగిక దాడి
చీరాల మండలంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీరాల పరిధిలో ఓ మహిళ నివసిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటివద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి వివాహితను బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు శనివారం ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.