News July 29, 2024
ప్రకాశం: NMMS మెరిట్ జాబితా విడుదల
గతేడాది డిసెంబర్‌లో జరిగిన NMMS పరీక్షలో ప్రతిభకనబరిచిన వారి జాబితాను deoprakasam.co.in వెబ్సైట్‌లో ఉంచినట్లు DEO సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి మెరిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని వారిపేరు, పుట్టినతేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగా ఉన్నట్లయితే న్యూడిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్‌లో ఆగస్టు 31లోగా అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News October 14, 2024
ఒంగోలులో ‘మీకోసం’ రద్దు
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జరగాల్సిన ‘మీకోసం’ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం నేడు లాటరీ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. దీంతో జిల్లా కలెక్టరుతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
News October 13, 2024
ప్రకాశం: మద్యం దుకాణాల లాటరీలు ఇవే.!
మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ES ఖాజా మొహియుద్దీన్ వెల్లడించారు. జిల్లాలో 171 దుకాణాలకు 3466 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో సోమవారం ఉదయం 8 గంటలకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని.. ఇందుకోసం 2 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
News October 13, 2024
ప్రకాశం జిల్లాకు వర్ష సూచన.. కాల్ సెంటర్ ఏర్పాటు
దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.