News March 25, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY ❤

image

అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం వార్షిక తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రసన్నాంజనేయ స్వామి, కొండమీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభలు కట్టనప్పటికీ ఆలయం తరఫున ఒక ప్రభను ఏర్పాటు చేశారు. రాత్రికి విద్యుత్ దీపకాంతులతో సింగరకొండ పుణ్యక్షేత్రం ధగధగలాడుతోంది.

Similar News

News November 14, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025

ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

image

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్‌లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 14, 2025

17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.