News March 29, 2025
ప్రకాష్ రెడ్డి ఇదే నా ఛాలెంజ్: ఎమ్మెల్యే సునీత

రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరుతో పాటు భూముల విషయంలో ఆయన చేసిన ఆరోపణల మీద పరిటాల సునీత మరోసారి నిప్పులు చెరిగారు. ప్రకాష్ రెడ్డికి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. తాము తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రకాష్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని లేదంటే తన స్వగ్రామం సహా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేస్తామన్నారు.
Similar News
News November 4, 2025
చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.
News November 4, 2025
విజయవాడ: పలగాని నాగవైష్ణవి హత్య కేసు ఏమిటంటే?

విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్.. తొలుత మేనకోడల్ని పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టకపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు వైష్ణవితో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడైన కృష్ణ.. ఆస్తి 2వ భార్యకు దక్కుతుందని భావించి <<18192610>>వైష్ణవిని.. శ్రీనివాస్, జగదీశ్ సాయంతో చంపారనేది అభియోగం.<<>> కాగా కుమార్తె మృతితో ప్రభాకర్ హఠాన్మరణం చెందగా కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది.
News November 4, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. VKB జిల్లా వాసులే 15 మంది

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతులు అధికులు VKB జిల్లాకు చెందిన వారే. తాండూర్: షేక్ ఖాలీద్ హుస్సేన్, జహాన్, నందిని, సాయిప్రియ, తనూష, వెంకటమ్మ, సెలేహ బేగం, జహీరా ఫాతిమా (పసిపాప), ముస్కాన్ బేగం, యాలాల్: గుర్రాల అఖిలా రెడ్డి, బందెప్ప, లక్ష్మి, దౌల్తాబాద్: హనుమంతు, బషీరాబాద్: దస్తరి బాబా (బస్సు డ్రైవర్) మృతి చెందారు.


