News April 12, 2025
ప్రకృతి తల్లి ఒడిలో వనజీవి (PHOTO OF THE DAY)

KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
Similar News
News April 15, 2025
ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతోఅభ్యర్థులు చాలావరకు సమస్యలు ఎదుర్కొన్నారు.
News April 15, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ నేతల ర్యాలీ ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరాలో రాందాస్ నాయక్ పర్యటన
News April 15, 2025
ఖమ్మం : బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుదిమళ్లకి చెందిన చెరుకుపల్లి నర్సింహారావు (47) గ్రామ పరిధిలో ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. రోజూలాగే సోమవారం పనికి వెళ్లి బైక్ పై ఇంటికి వెళ్తుండగా.. అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నర్సింహారావు తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.