News April 12, 2025
ప్రకృతి తల్లి ఒడిలో వనజీవి (PHOTO OF THE DAY)

KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
Similar News
News October 29, 2025
తీరం దాటిన తీవ్ర తుఫాన్

AP: మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రా.11:30 గంటల నుంచి రా.12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.
News October 29, 2025
అక్టోబర్ 29: చరిత్రలో ఈరోజు

1899: కవి, స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
1940: రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
1953: సినీ దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మరణం
1971: ఒడిశాలో తుఫాన్ తాకిడికి 10వేల మంది మృతి
1976: డాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ జననం
2005: వలిగొండ వద్ద రైలు పట్టాలు తప్పి వాగులో పడిపోవడంతో 116 మంది మృతి (ఫొటోలో)
News October 29, 2025
SRPT: టీచర్గా మారి పాఠాలు బోధించిన కలెక్టర్

ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాఠాలు బోధించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఇంగ్లిష్ చదివించి తెలుగులో అర్ధాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ ఫిదా అయ్యారు.


