News March 5, 2025
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ చేతన్

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సాయి ఆరామంలో ప్రభుత్వం-ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై ఉద్యానవన, సెరీకల్చర్, వెలుగు శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. రైతు సేవ కేంద్రాలు, మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 22, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక వేధింపులు.. ఐదేళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేశాడన్న కేసులో నేరం రుజువు కావడంతో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానాను జిల్లా పొక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ విధించారు. వింజమూరు మండలానికి చెందిన బాలిక 2013 మే 6న కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. కృష్ణ అనే వ్యక్తి లైగింక దాడికి పాల్పడగా..వ్యతిరేకించడంతో బావిలోకి తోసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా శిక్ష పడింది.
News March 22, 2025
అనకాపల్లి నేటి నుంచి కేజీబీవీల్లో దరఖాస్తుల స్వీకరణ

అనకాపల్లి జిల్లాలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆర్ జయ ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7,8,9 తరగతులు ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 20 విద్యాలయాల్లో 1600 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
News March 22, 2025
6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.