News March 5, 2025
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములం అవుదాం: కలెక్టర్

మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని.. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నం.1లో నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం విజయవాడ రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం-ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ జరిగింది.
Similar News
News September 16, 2025
HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 16, 2025
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: జేసీ

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1,56,505 ఎకరాల్లో వరి సాగైందని, 4.34 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు ప్రక్రియపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు.
News September 16, 2025
ఒక్కసారిగా ‘టమాటా’ విలన్ అయ్యాడు!

వారం క్రితం కిలో రూ.40 వరకు పలికిన టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో రూ.5-8, 20 కిలోల గంప కేవలం రూ.150 మాత్రమే పలుకుతుండటంతో రవాణా ఖర్చులకే ఆ డబ్బు సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ డివిజన్ పరిధిలో 5,500 హెక్టార్లలో పంట సాగు కాగా దిగుబడులు భారీగా వస్తున్నాయి. ధరలు మాత్రం లేకపోవడంతో కొందరు మార్కెట్లో, మరికొందరు రోడ్డు గట్టున టమాటాలను వదిలి వెళ్తున్నారు.