News April 3, 2025

ప్రకృతి వ్యవసాయ జిల్లాగా పార్వతీపురం: కలెక్టర్

image

జిల్లాలో సాధ్యమైనంత వరకు ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయ జిల్లా దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక రంగాల వృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో 4,800 ఎకరాల వరకు పైనాపిల్ సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 250 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరగడం పట్ల కలెక్టర్ ఆరా తీశారు.

Similar News

News November 17, 2025

మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

image

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

image

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్‌ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.