News February 4, 2025
ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన కలెక్టర్

నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవ్ రెడ్డి పొలాలను పరిశీలించి, వారు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News November 21, 2025
రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.
News November 21, 2025
పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.
News November 21, 2025
ఏలూరు: GOOD NEWS.. ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా మెయిన్స్, సివిల్స్ కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ అధికారిణి నాగరాణి తెలిపారు. దీనిలో భాగంగా, అర్హుల ఎంపికకు డిసెంబర్ 5న రాజమండ్రిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఎంపికైన వారికి డిసెంబర్ 10 నుండి విజయవాడ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం 9030211920 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


