News October 23, 2024
ప్రగతిపథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన 80 పాటల సంకలనం ‘ప్రగతిపథంలో ప్రజా పాలన’ పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
Similar News
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
News December 7, 2025
MBNR: మూడో విడతలో 2,786 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తుది వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,152 వార్డులకు గాను, ఏడు వార్డులు మినహా 1,145 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 2,786 మంది వార్డు సభ్యులు నిలిచినట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలో అత్యధికంగా 376, బాలానగర్లో 308 మంది పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు.


