News April 5, 2024

ప్రచారంలో విజయసాయి రెడ్డి సతీమణి

image

సార్వత్రిక ఎన్నికల పోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు మించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాలకు పరిచయమే లేని తమ కుటుంబ సభ్యులను కూడా అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దించేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థుల వారసులు ప్రచార పర్వంలో ఉండగా, తాజాగా వైసీపీ MP అభ్యర్థి విజయసాయి రెడ్డి భార్య సునంద కూడా నెల్లూరులో ప్రచారం చేస్తున్నారు.

Similar News

News December 20, 2025

నెల్లూరు హౌసింగ్ పీడీ వేణుగోపాల్ బదిలీ

image

జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను అమరావతి హౌసింగ్ ప్రధాన కేంద్రంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన స్థానంలో టిడ్కో ఈఈ మహేశ్‌కు ఇన్‌ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో వేణుగోపాల్‌ను రిలీవ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

News December 20, 2025

కాకాణి మైనింగ్ కేసు… A2 శివారెడ్డికి రిమాండ్

image

మాజీమంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కేసులో A2గా ఉన్న శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకున్న గిరిజనులను బెదిరించాడన్న ఆరోపణల కేసులో ముద్దాయిగా చేర్చడంతో.. 10 నెలలుగా పరారీలో ఉన్నారు. అతడిని తాజాగా అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం గూడూరు మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. న్యాయ స్థానం ఆయనకు జనవరి 2 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది.

News December 20, 2025

నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

image

నెల్లూరు జిల్లాలో హైరిస్క్‌ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్‌’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.