News May 3, 2024
ప్రచారానికి మిగిలింది.. ఇంకా 9 రోజులే

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా 9 రోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.
Similar News
News October 21, 2025
జాతీయ రహదారి భూసేకరణ నవంబర్‌లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సమస్యలను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేసి, ఎన్హెచ్ఏఐకి భూ బదలాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు మెరుగైన పరిహారం అందుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూములకు పరిహారం చెల్లింపులు, రీ-సర్వే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించాలని ఆయన ఆదేశించారు.
News October 21, 2025
ఖమ్మంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

శాంతి సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
News October 20, 2025
ఖమ్మం: విద్యార్థి మృతి.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి జస్వంత్ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొదుమూరులోని ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే తమ బిడ్డ మృతి చెందాడన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.