News May 3, 2024
ప్రచారానికి మిగిలింది.. ఇంకా 9 రోజులే
ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా 9 రోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.
Similar News
News November 2, 2024
కొత్తగూడెం: తండ్రిని చంపిన కుమారుడు
మణుగూరు పగిడేరు ఎస్టీ కాలనీకి చెందిన కుంజా భీమయ్యను (59) తన కొడుకు కుంజా రాములు శుక్రవారం రాత్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు వివరాలిలా.. మద్యం మత్తులో ఉన్న రాములు కర్రతో భీమయ్య తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భీమయ్యను ఆస్పత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
News November 1, 2024
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తుమ్మల భేటీ
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ కు సంబంధించి అంశంపై చర్చించారు. వచ్చే పంట కాలం లోపల నీరు వచ్చే విధంగా పనులు ప్రారంభించి సత్తుపల్లికి నీరు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. కావాల్సిన భూ సేకరణ, ఇతర పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.