News February 12, 2025

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుహాసిని 

image

బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతిచెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని అన్నారు. చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని, కోళ్ల ఫారాల నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం శానిటైజర్‌లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. మాస్క్ ధరించిన తరువాత ఫారాల్లో పనులు చేయాలని సూచించారు. 

Similar News

News July 7, 2025

రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

image

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.

News July 7, 2025

250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

ఇబ్రహీంపట్నంలోని మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్ వ‌ద్ద 250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ స‌ఫారీ, బ‌యోడైవ‌ర్సిటీ పార్క్, నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ ఏర్పాటు ద్వారా మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.