News February 25, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు ఎస్పీ

ప్రముఖ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో నెల్లూరు జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వల వేస్తారని చెప్పారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News March 25, 2025
జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.
News March 25, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.
News March 25, 2025
నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.