News April 15, 2025
ప్రజలకు అండగా ఉంటా: గద్వాల ఎమ్మెల్యే

పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీదొడ్డి మండలానికి చెందిన మంజులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీద అందజేశారు.. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.
News October 17, 2025
త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం: MLA

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వరంగల్ సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే చెప్పారు.
News October 17, 2025
అమరచింత: కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాల తయారీ

అమ్మాపురంలో వెలసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీలు ప్రతిఏటా పట్టు వస్త్రాలను తయారు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈనెల 22 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలీలు స్వామికి పట్టు వస్త్రాలు తయారీని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 28న ఉద్దాల ఉత్సవం స్వామికి పట్టు వస్త్రాలను అలంకరిస్తారు.