News August 12, 2024
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పరిష్కార వేదిక: నాగలక్ష్మీ

మంగళగిరి ప్రజలకు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి గల ఈద్గా మైదానంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.
Similar News
News November 12, 2025
GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
News November 12, 2025
న్యూమోనియా రహిత సమాజ నిర్మాణం లక్ష్యం: కలెక్టర్

న్యూమోనియా వ్యాధి రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియా అన్నారు.
News November 12, 2025
గుంటూరు రైల్వే, బస్టాండ్లలో భద్రతా తనిఖీలు

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


