News August 12, 2024
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పరిష్కార వేదిక: నాగలక్ష్మీ
మంగళగిరి ప్రజలకు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి గల ఈద్గా మైదానంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.
Similar News
News September 17, 2024
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థులపై TDP కసరత్తు
కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.
News September 17, 2024
పల్నాడు: ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి
ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి చెందిన ఘటన నకరికల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అతని భార్య శివ కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కెనాల్ కాలువ కట్టపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కాలువలో పడ్డారు. భర్త ఒడ్డు పట్టుకుని బయటకు రాగా, భార్య కాలువలో గల్లంతై మృతి చెందింది.
News September 17, 2024
తాడేపల్లి: ‘రైతులు కోరుకున్న చోటే ప్లాట్లు’
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని రైతులు స్వచ్చందగా తమ భూమిని పూలింగ్‌కి అందజేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు ఏడు ఎకరాలు భూమికి సంబందించిన నలుగురు రైతులకు అంగీకారపత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు కోరుకున్న చోటే ప్లాట్స్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలానే కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతులు ఖాతాలో వేయటం జరిగిందని త్వరలోనే 2వ ఇన్స్టల్మెంట్ వేస్తామన్నారు.