News April 8, 2025
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలి: పార్వతీపురం ఎస్పీ

పోలీసు అధికారులు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రొబేషనరీ ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణగా, నిజాయితీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కేటాయించిన పోలీస్ స్టేషన్లను తరచూ సందర్శించి ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాలపై పట్టు సాధించాలన్నారు.
Similar News
News November 18, 2025
నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

నషాముక్త భారత్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.