News April 14, 2025
ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2005 మహిళా సంఘాలకు రూ.3,12,64,235 చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. రూ.కోటితో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News April 19, 2025
జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి

అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం గద్వాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వరుడికి రుద్రాభిషేకాలు అనంతరం జోగులాంబ అమ్మవారికి కుంకుమ అష్టోత్తర అర్చనలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
News April 19, 2025
శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News April 19, 2025
నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.