News April 14, 2025
ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2005 మహిళా సంఘాలకు రూ.3,12,64,235 చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. రూ.కోటితో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News January 20, 2026
మన ఆయుష్షు తగ్గించే కొన్ని అపవిత్ర పనులు

కొన్ని అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. దాని ప్రకారం.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకపోతే స్వచ్ఛమైన గాలి అందక అనారోగ్యం కలుగుతుంది. రాత్రిపూట పెరుగు, దాంతో చేసినవి తింటే వ్యాధులు రావొచ్చు. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించడం, శ్మశానంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వచ్చే విష వాయువు పీల్చడం హానికరం. స్త్రీలు, పిల్లలు, మానవత్వం పట్ల చెడు ఆలోచనలు ఉంటే ఆయుష్షు క్షీణిస్తుంది.
News January 20, 2026
కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.
News January 20, 2026
NZB: CM దావోస్ ట్రిప్ దండగ.. Xలో కల్వకుంట్ల కవిత

CM రేవంత్ రెడ్డి ట్రిప్ దండగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Xలో విమర్శించారు. ఎక్కే విమానం – దిగే విమానం .. రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి అని ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్‌లు, TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చేసుకున్న MOUలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.


