News March 4, 2025
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి: కలెక్టర్

విజయవాడ నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్‌చంద్ర పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో శాఖ అధికారులు, సచివాలయ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని సూచించారు.
Similar News
News December 6, 2025
సిద్దిపేట: సర్పంచ్ పోరు.. ఇక్కడ బాల్యమిత్రులే ప్రత్యర్థులు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పంచాయతీ ఎన్నికల్లో బాల్యమిత్రులు ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్ సర్పంచ్ పదవికి ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకే పాఠశాల, ఒకే బెంచీ నుంచి ఎదిగిన వీరి పోరు ఆసక్తి రేపుతోంది. గతంలో భార్య ద్వారా గెలిచిన అనుభవం శ్రీనివాస్‌కు బలం కాగా, యువత మద్దతు శ్రీధర్‌కు అదనపు బలంగా ఉంది. ఈ పోటీలో పాత సేవలు గెలుస్తాయా, కొత్త వాగ్దానాలా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది.
News December 6, 2025
EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.
News December 6, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.


