News March 28, 2024

ప్రజలకు చేరువ అయ్యేలా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

పోలీస్ విధులు ప్రజలకు చేరువ అయ్యేలా ఉండాలని గద్వాల SP రితిరాజ్ సూచించారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలు రికార్డులు పరిశీలించారు. పనిచేయని సీసీ కెమెరాలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది తమ సమస్యలను ఎస్పీతో మొరపెట్టుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.

Similar News

News April 10, 2026

MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 9, 2026

MBNR: రహదారి భద్రతపై రాష్ట్రస్థాయి సమీక్ష

image

రాష్ట్ర CS కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అర్రైవ్ అలైవ్” కార్యక్రమం అమలు, దాని సిద్ధతపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ డి.జానకి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.

News April 9, 2026

సిరి వెంకటాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. నవాబుపేట 40.8, మహమ్మదాబాద్ 40.6, కౌకుంట్ల 40.5, చిన్న చింతకుంట 40.3, భూత్పూర్ 40.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 39.8, మిడ్జిల్ మండలం దోనూరు, మూసాపేట మండలం జానంపేట 39.6, మహబూబ్‌నగర్ అర్బన్ 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.