News February 20, 2025
ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కృష్ణ ఆదిత్య

వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలోని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
Similar News
News March 14, 2025
ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
News March 14, 2025
BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్‌లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.