News January 11, 2025
ప్రజలకు ప్రకాశం ఎస్పీ సూచనలు

జిల్లాలో కోడి పందేలు, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, క్రికెట్ నిర్వహించుకోవాలన్నారు. పండగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
Similar News
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
News November 22, 2025
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్‌కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్‌తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.
News November 22, 2025
ప్రకాశం: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరులో జరిగింది. కలిగిరి(M) ఏపినాపికి చెందిన విష్ణువర్ధన్‌కు సరితతో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు పామూరులోని లాడ్జిలో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.


