News January 11, 2025
ప్రజలకు ప్రకాశం ఎస్పీ సూచనలు
జిల్లాలో కోడి పందేలు, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, క్రికెట్ నిర్వహించుకోవాలన్నారు. పండగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
Similar News
News January 13, 2025
పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. మరొకరు మృతి
ఇటీవల పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ల గురించి మరువక ముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో కాలిపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లి దాసరి లక్ష్మీరాజ్యం కూడా తనువు చాలించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 13, 2025
గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్ను ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 13, 2025
మార్కాపురం: దారణ హత్య.. హంతకులు ఎవరంటే?
మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణతో తన భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకటనారాయణను 2005వ సం”లో వెంకటేశ్వర్లు హత్య చేసి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సుబ్బలక్ష్మమ్మ తన పద్ధతి మార్చుకోలేదనే అనుమానంతో వెంకటేశ్వర్లు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి 4 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు.