News July 19, 2024
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సంతోష్

బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బధావత్ సంతోష్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News November 16, 2025
MBNR:U-14..18న వాలీబాల్ ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 18న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ లతో ఉ.9:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.
News November 16, 2025
MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.
News November 15, 2025
MBNR: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకితో పాటు పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే నేషనల్ హైవే 44, 167 పై బ్లాక్‌స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలన్నారు.


