News April 11, 2025

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ASF కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ASF జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో DMHO సీతారాంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు,ఆయుష్ వైద్యులతో కలసి ఆరోగ్య సేవలపై ఆరా తీశారు.

Similar News

News December 13, 2025

AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

image

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.

News December 13, 2025

ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

image

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.

News December 13, 2025

వేములవాడ: మార్కెట్ ఛైర్మన్‌పై దాడి.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: SP

image

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై ఈ మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.