News April 11, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ASF జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో DMHO సీతారాంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు,ఆయుష్ వైద్యులతో కలసి ఆరోగ్య సేవలపై ఆరా తీశారు.
Similar News
News April 20, 2025
ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
News April 20, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
News April 20, 2025
విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.